Menu

   

కొన్ని దృశ్య మాధ్యమాల్లో ప్రసారమైన కథనాలకు వాస్తవిక వివరణ

కొన్ని దృశ్య మాధ్యమాల్లో ప్రసారమైన కొన్ని కథనాలకు బదులుగా పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ (హైదరాబాద్) మరి దాని అనుబంధ సంస్థలు కొన్ని విషయాలకు వివరణ ఇవ్వవలసిన ఆవశ్యకతను గుర్తించి ఈ క్రింది వివరణ ఇవ్వడమైనది.

పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థల ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యం:

          బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించింది మొదలు వారి ప్రధాన లక్ష్యం ఈ భూమిపైన ప్రతి ఒక్కరికి 'ఆనాపానసతి' ధ్యానంతో పాటు పిరమిడ్లకు సంబంధించిన జ్ఞానాన్నీ, పిరమిడ్‌లో ధ్యానం చేయడం ద్వారా పొందేశక్తిని గురించి పరిచయం చేయడం. ఈ దిశగా వెళ్ళేందుకు 20 సంవత్సరాలకు ముందు పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈనాటి వరకు పత్రీజీ మరి పిరమిడ్ మాస్టర్ల అవిశ్రాంత కృషి ద్వారా లక్షలాది ప్రజలు ఉచిత ధ్యాన శిక్షణా తరగతుల ద్వారా లబ్దిపొందారు. ఆంధ్రప్రదేశ్ మరి భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లో వేలాది పిరమిడ్ ధ్యాన కేంద్రాలను, ఈ ధ్యానం ద్వారా లబ్దిపొందిన వ్యక్తులు స్వచ్ఛందంగా ప్రారంభించారు. పిరమిడ్ శక్తిని విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు ఎవరికి వారు స్వచ్ఛందంగా వారివారి ప్రాంతాల్లోనూ, ఇండ్ల పైనా వేలాది పిరమిడ్లను నిర్మించారు.

          ఈ కార్యక్రమాల్లో భాగంగా పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థల ఉద్యమానికి కేంద్రంగా ఉండేందుకూ, పెద్ద ఎత్తున ధ్యాన కార్యక్రమాలను చేపట్టేందుకు అనువుగా కడ్తాల్ గ్రామంలో హైదరాబాదు సమీపాన ఒక మహా పిరమిడ్‌ను నిర్మించేందుకు వీలుగా పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ను (హైదరాబాద్) ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంగణంలో పత్రీజీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు "ధ్యానమహాచక్రం" అని పిలువబడే ప్రపంచ ధ్యాన మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహా సభల్లో సుమారు 10 లక్షల మంది ధ్యానులు పాల్గొన్నారు. ఉచిత ధ్యాన తరగతులు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతి ఒక్కరికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలు ఈ 11 రోజులపాటు ఏర్పాటు చేయడం జరిగింది.

ధ్యానుల భావ వ్యక్తీకరణ:-

          ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానాన్ని బోధించడం ద్వారా ప్రతి ఒక్కరిలోనూ ప్రేమ, కరుణ, సహనాన్ని పెంపొందించేందుకు పత్రీజీ స్వయంగా పూనుకున్నారు. ఈ ధ్యాన మహాసభల్లో ధ్యానాభిలాషులు వయస్సు, లింగభేదాలు లేకుండా వారికి కలిగిన భావోద్వేగాన్ని లక్షలాదిమంది ధ్యానుల మధ్య స్వచ్ఛందంగా గురువుగారిని ఆలింగనం చేసుకోవడం ద్వారా మరి ఇతర చర్యల ద్వారా వ్యక్తపరిచారు. ఈ చర్యలు కేవలం వారికి కలిగిన ఆనందాన్ని, ఏకత్వాన్ని వ్యక్తపరచే సంకేతాలుగా మాత్రమే చెప్పుకోవచ్చు. అయితే కొన్ని దృశ్యమాధ్యమాలు ఈ చర్యలకు వక్రభాష్యం, విపరీత అర్థాలు ప్రసారం చేయడం దురదృష్టకరం. ఇలాంటి తొందరపాటు, సరికాని తీర్పులద్వారా పత్రీజీ మరి పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థల నిర్విరామ కృషి ఫలితంగా ప్రఖ్యాతిగాంచిన పిరమిడ్ ధ్యానం, ఆధ్యాత్మిక విజ్ఞాన ఫలితాలను అనేక మందికి లభించడానికి అడ్డు పడినవారవుతారు.

స్థిరాస్తిలో పెట్టుబడులు:

          వ్యక్తులూ మరి ఈ ఉద్యమం యొక్క ఆశయాలపై అభిలాష కలిగిన సంస్థలు ఇచ్చిన విరాళాలతో పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్(హైదరాబాద్)వారు ఈ ఆస్థి మొత్తాన్ని సంపాదించుకున్నారు. ఈ ఆస్థి కొనుగోళ్ళు అన్నీ చట్టపరంగా, న్యాయపరంగా చేసినవే. పత్రీజీ ఎలాంటి ఆస్థిగానీ, ధనార్జన కానీ చేసుకోలేదని నిర్ద్వంద్వంగా చెప్పగలము.

పిరమిడ్ శక్తి ప్రాధాన్యత:

          గీజా పిరమిడ్ నమూనాలో కట్టిన పిరమిడ్లు మానసిక ఒత్తిడిని తొలగించేందుకూ, ధ్యానానికీ, గాయాలను నయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుచున్నాయి. పిరమిడ్లు శక్తి క్షేత్రాలనీ మరియు అవి భద్రపరిచేందుకూ, స్వస్థత చేకూర్చేందుకూ, మరి ధ్యానానికి ఉపయోగకరమని ప్రపంచమంతటా చేపట్టిన శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిచేస్తున్నాయి. రష్యా దేశంలో చమురు క్షేత్రాల్లో చమురు ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగించారు. ఏపుగా పెరగడంలోనూ, ఆరోగ్యకరంగా ఉండటంలోనూ పిరమిడ్‌లో పెంచబడిన మొక్కలు ఇతర మొక్కల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయని ప్రయోగాల ద్వారా నిరూపించబడింది. ఎక్కువకాలం పిరమిడ్ శక్తిని తీసుకోవడం వలన మానసిక ఒత్తిడి తగ్గించవచ్చనీ, అనేక వ్యాధులు సోకకుండా అదుపు చేయవచ్చని వైద్య పరిశోధనల ద్వారా నిరూపితమైంది. బిల్ షుట్  మరి ఎడి పెటిట్ అనే శాస్త్రజ్ఞులు "పిరమిడ్ రహస్య శక్తి" "The Secret Power of Pyramids" అనే పుస్తకంలో ఈ పరిశోధనలను గ్రంధస్థం చేశారు. My Experiments with Pyramid Models ("పిరమిడ్ నమూనాలతో నా ప్రయోగాలు") అన్నటువంటి పేరుతో మెలేక మణిపాల్ వైద్యకళాశాలలో ఒక డాక్టరు పరిశోధనలు జరిపారు. ఈ లాభాలను గమనించిన పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థల ఉద్యమం ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం ద్వారా, భారతదేశమంతటా ధ్యానం కొరకు పిరమిడ్లను నిర్మించడం ద్వారా, ఈ విజ్ఞానాన్ని ప్రతిఒక్కరికీ అందుబాటులో తేవడానికి కార్యాచరణ చేపట్టింది. పిరమిడ్ కేంద్రాలన్నింటిలోను ధ్యాన శిక్షణ ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. లక్షలాది మంది ధ్యానులు పిరమిడ్‌లో ధ్యానం చేయడం ద్వారా ప్రగాఢ ధ్యానస్థితిని, అనేక అనుభవాలను పొందడం జరిగింది. వారు స్వచ్ఛందంగా ఈ పద్ధతిని వ్యాప్తి చేస్తున్నారు.

Find below the reference information on Scientific Research about Pyramid Energy :

Compiled information on Pyramid Research and Scientific Recordings

My experiments with Pyramid Model - by Dr. Surekha Bhat, Assistant Professor in Biochemistry, Melaka Manipal Medical College, India

e-book - Power of Pyramids (86 pages, 4.5 mb)

పిరమిడ్ ప్రాంగణం చుట్టుప్రక్కల స్థిరాస్తి వ్యాపారాభివృద్ధి:

          ఇలాంటి పెద్ద సంస్థ చుట్టూ అనేక స్థిరాస్తి అభివృద్ధికారులు స్థిరాస్తివ్యాపారాన్ని అభివృద్ధి చేయడం సహజంగా అన్నిచోట్లా జరిగేటువంటిది. ఈ స్థిరాస్తి వ్యాపారాలతో పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ (హైదరాబాద్) వారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఆ వ్యాపారులకూ కొనుగోలుదారులకు సంబంధించిన విషయము. కరపత్రాల్లోనూ, వ్యాపార ప్రకటనల్లోనూ (boards) పత్రిగారి చిత్రపఠాన్ని ఉపయోగించినంత మాత్రాన పత్రిగారికి గాని, పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్(హైదరాబాద్) వారికి గాని అందులో ప్రమేయము ఉన్నట్లుకాదు. వారి వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు గురువులూ మరి ఇలాంటి సంస్థల చిత్రాలను వ్యాపార కరపత్రాలలో ఉపయోగించడం సర్వసాధారణంగా జరిగే విషయం. ఈ నాడు ఇలా జరగడం భారతదేశంలో పలుప్రాంతాలలో మనము చూడవచ్చు. ఈ విషయమే రెండు నెలల క్రిందట నుండి హెచ్చరిక బోర్డులు మరియు బహిరంగ ప్రకటనలు చేశాం.

          చివరగా మా సభ్యులకూ, పిరమిడ్ మాస్టర్లకూ, శ్రేయోభిలాషులకూ, మరి ఇతరులకు మేము హామి ఇచ్చేదేమిటంటే, పిరమిడ్ లేక పత్రీజీ కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ, అసాంఘిక సంఘటనలు జరుగలేదు. ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం ద్వారా ఈ భూమండలాన్ని శాంతికీ, ప్రేమకూ, ఏకత్వానికి ఆలవాలంగా తయారు చేయాలనేదే మా ప్రయత్నము. మరింత ఉత్సాహంతోనూ, శక్తితోనూ ప్రతి ఒక్కరికీ ధ్యానాన్ని, పిరమిడ్ శక్తిని అందించేందుకూ ఈ ప్రసారాలు మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. అందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాము.

          మా సంస్థ చేపడుతున్న కార్యకలాపాల గురించి, ప్రణాళికల గూర్చి, సమావేశాల గురించిన సంపూర్ణ సమాచారము మా వెబ్‌సైట్ www.pssmovement.org లో లభిస్తుంది. మరి సమాచారము కొరకు మీరు This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. నుంచి తెలుసుకోవచ్చు.

మూవ్‌మెంట్
మూవ్‌మెంట్ గురించి
ఎంబ్లం
18 ఆదర్శ సూత్రాలు
శాకాహారం
  ధ్యానం
ఆనాపానసతి ధ్యానం

ధ్యానం వల్ల లాభాలు
ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన సిద్ధాంతాలు
ధ్యానానుభవాలు
పిరమిడ్ ధ్యానం
ఏకతా ధ్యానం
  పిరమిడ్స్
పిరమిడ్ శక్తి
పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్
మహేశ్వరా మహా పిరమిడ్

ప్రచురణలు 
ధ్యానాంధ్రప్రదేశ్
కరపత్రాలు

  బ్రహ్మర్షి పత్రీజీ
పరిచయం

పుస్తకాలు
ఆడియోస్/వీడియోస్
వీడియో లైబ్రరీ
ఆడియో లైబ్రరీ
పత్రీజీ కాన్సెప్ట్స్
 
ధ్యాన గీతాలు

పత్రీజీ సందేశాలు
పరిప్రశ్న- పరిసమాధానం
ఈ-బుక్స్
ఫోటోలు
క్యాలెండర్
  ప్రాజెక్ట్స్
ధ్యాన ఆరోగ్యం
ధ్యాన గ్రామీణం
ధ్యాన వ్యవసాయం
ధ్యాన అధ్యాపకులు
ధ్యాన మహిళ
ధ్యాన యువత
ధ్యాన ఖైదీ
  సమాచార విభాగం
ఉచిత ధ్యానం
విరాళాలు
న్యూస్ క్లిప్స్
డైరెక్టరీ
సైట్ మ్యాప్

 

Go to top